Weekly Horoscope

13th October, 2019 to 19th October, 2019

Cancer

కర్కాటకం

ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు.

ఆలోచనలు కలసి వస్తాయి.

సభలు,సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులతో  ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులను సైతం చేపడతారు.

కొన్ని వివాదాల నుంచి మిత్రుల సహాయంతో బయటపడతారు.

ఇళ్లు, వాహనాలు కొంటారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

సమయానుసారం అవసరాలకు సొమ్ము అందుతునే ఉంటుంది. రుణాలు సైతం తీరుస్తారు.

మొత్తం మీద ఎటువంటి సమస్య ఎదురుకాకుండా గడుస్తుంది.

మీ పై కుటుంబ సభ్యులు అభిప్రాయాలు మార్చుకుంటారు.

మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు.

ఎన్నడో దూరమైన బంధువులు తిరిగి ఇంటికి చేరుకోవడం విశేషం.

అలాగే, సంతానం ఉద్యోగాలు కూడా సంతృప్తినిస్తాయి.

ఆరోగ్యం మధ్యమధ్యలో కొంత ఇబ్బంది కలిగినా ఉపశమనం లభిస్తునే ఉంటుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం, విస్తరణలో విజయం సాధిస్తారు.

ఉద్యోగాల విధి నిర్వహణలో ఆటంకాలు తొలగించుకుని ముందుకు సాగుతారు.

రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు.

మహిళలకు కుటుంబంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces