Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Cancer

కర్కాటకం

పనుల్లో ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది.

స్నేహితులే శత్రువులుగా మారతారు.

విద్య, ఉద్యోగావకాశాలు కొన్ని చేజారవచ్చు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు.

వివాదాలకు దూరంగా ఉండండి.

నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిస్థితులు అనుకూలించక కొంత ఇబ్బంది పడతారు.

ఎంత కష్టించినా తగినంత ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూరక డీలా పడతారు.

అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

షేర్లు, భూముల విక్రయాల ద్వారా రావలసిన సొమ్ము కూడా సకాలంలో చేతికందకపోవచ్చు.

బంధువులతో మాటపడతారు.

మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు తిరస్కరిస్తారు.

కొన్ని విషయాలలో సోదరులతో విభేదిస్తారు.

సంతానపరంగా చికాకులు తప్పకపోవచ్చు.

స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందక నిరాశ చెందుతారు.

పెట్టుబడులు కూడా ఆలస్యమవుతాయి.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణ కత్తిమీద సాముగా మారవచ్చు.

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మంచిది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces