Weekly Horoscope
1st December, 2019 to 7th December, 2019
Cancer
కర్కాటకం
కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.
శ్రమ మరింత పెరుగుతుంది.
సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
ఆస్తుల విషయంలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.
డబ్బు కోసం ఇబ్బందులు పడతారు.
అవసరాలు పెరిగి రుణాలు చేస్తారు.
ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సైతం విరమిస్తారు.
మొత్తం మీద ఆర్థికంగా ఆటుపోట్లు తప్పక పోవచ్చు.
కుటుంబంలో మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు.
తరచూ సంతానపరంగా చిక్కులు ఎదురవుతూనే ఉంటాయి.
కొన్ని వేడుకలను రద్దు చేసుకుంటారు.
అలాగే, సోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
ఆరోగ్యపరం గా తరచూ కొన్ని రుగ్మతలతో బాధపడుతూనే ఉంటారు.
వ్యాపారాలలో దక్కిన లాభాలతో సరిపెట్టుకోవడం మంచిది.
కొత్త పెట్టుబడులపై తొందరవద్దు.
ఉద్యోగాలు...ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు.
పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు తప్పుతాయి.
మహిళలకు బంధువులతో వివాదాలు.
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.