Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Cancer

కర్కాటకం

సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం.

శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.

ఊహించని అరుదైన ఆహ్వానాలు రాగలవు.

ఆస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు, అయితే ఒప్పందాలు వాయిదా వేస్తారు.

కోపతాపాలకు మాత్రం దూరంగా ఉండండి.

మీ ఆభిప్రాయాలను మిత్రులు తిరస్కరించడంతో కొంత కలత చెందుతారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు లోటురాదు.

అలాగే, ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి కొంత లబ్ధి పొందుతారు.

కుటుంబ సభ్యులు మీ పై ఉంచిన గురుతర బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సోదరులు మరింత చేయూతనిస్తారు. వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యపరంగా మధ్యమధ్యలో కొన్ని రుగ్మతలు ఎదురైనా అధిగమిస్తారు.

వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా అంది ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. విస్తరణలో విజయం సాధిస్తారు.

ఉద్యోగస్తులు పట్టుదలతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.

విధులు ప్రశాంతంగా, సాఫీగా సాగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనుకూల వాతావరణం.

మహిళలకు నూతన ఉద్యోగాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces