Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Cancer

కర్కాటకం

ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థుల యత్నాలు కొంత ఫలిస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీలో దాగిన నైపుణ్యత, ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

ఎంత అనుకూలత ఉన్నా ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగడం మంచిది.

సొమ్ములకు లోటు ఉండదు.

ఏదో విధంగా అందుతునే ఉంటుంది. అవసరాలు తీరతాయి.

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు.

పెద్దల సలహాలు , సూచనలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. అయినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి.

కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది.

ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఇష్టం లేకున్నా తప్పకపోవచ్చు.

బాధ్యతలు కూడా పెరుగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఉపశమనం లభించే సమాచారం అందుతుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

సూర్యారాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces