Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Capricorn

మకరం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు

ఆత్మీయులు, స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు.

వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం.

విద్యార్థులకు ఊహించని ఫలితాలు సంతోషం కలిగించవచ్చు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

అనుకోని విధంగా డబ్బు అందుతుంది.

దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి.

సన్నిహితులు కూడా సహాయపడతారు.

కుటుంబంలో సంతానపరంగా ముఖ్యంగా మొదటి సంతానం నుంచి లాభాలు కలుగుతాయి.

దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

బంధువులు, కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి.

తల్లితరఫు నుంచి భూలాభాలు ఉండవచ్చు.

శారీరక శ్రమ, అలసట వల్ల రుగ్మతలు ఎదురైనా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో మొదట్లో సామాన్యంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటాయి.

అధిక లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

ఉద్యోగాలలో పై స్థాయి అధికారుల మన్ననలు పొందుతారు.

మంచి గుర్తింపు రాగలదు.

ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కుతాయి.

మహిళలకు విశేష ఆదరణ లభిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces