Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Capricorn

మకరం

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

రహస్య విషయాలు తెలుసుకుంటారు.

చిరకాల మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.

రుణ దాతల ఒత్తిడుల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలబ్ధి.

పొదుపుచర్యల ద్వారా మరింత బలపడతారు.

కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల సందడి.

మొదటి సంతానంతో ఇబ్బందులు తొలగుతాయి.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

కొద్దిపాటి రుగ్మతలు తప్పవు. వైద్య సలహాలు స్వీకరిస్తారు.

వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

ఆశించిన లాభాలు దక్కుతాయి.

విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు.

ఉద్యోగాలలో మీ పై వచ్చిన విమర్శల నుంచి బయటపడతారు.

మీ సమర్థత, సత్తా చాటుకుంటారు.

రాజకీయవేత్తలు కోరుకున్న పదవులు దక్కించుకుంటారు.

సేవలకు తగిన గుర్తింపు రాగలదు.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces