Weekly Horoscope
10th February, 2019 to 16th February, 2019
Capricorn
మకరం
అనుకున్న కార్యాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.
విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు.
కాంట్రాక్టులు దక్కుతాయి.
విలాసవంతంగా గడుపుతారు.
గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది.
ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు.
షేర్ల విక్రయాలలోనూ లాభాలు పొందుతారు.
కుటుంబంలోని అందరి ప్రేమాభిమానాలు పొందుతారు.
ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.
వివాహాది శుభకార్యాలు ఉత్సాహంగా జరుపుతారు.
కొద్దిపాటి నలత చేసి ఇబ్బంది పడతారు. వైద్యసేవలు తప్పవు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడిస్తారు.
పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగులు ప్రమోషన్లు లభిస్తాయి.
పై స్థాయి వారి నుంచి అభినందనలు అందుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు, సన్మానాలు.
మహిళలకు ఆస్తి లాభాలు.
సోదరీల నుంచి సహాయం అందుతుంది.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.