Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Capricorn

మకరం

ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగండి.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు కలిసివస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు పొందుతారు.

చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

సొమ్ముకు లోటు ఉండదు.

రుణాలు కొంతమేరకు తీరతాయి.

తండ్రి తరఫున సైతం ధన లాభాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

సంతానపరంగా ముఖ్య విషయాలు తెలుస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు.

మీ ఊహలు, అంచనాలు అందరితోనూ పంచుకుంటారు.

ఆరోగ్య విషయంలో కొంత నలత తప్పకపోవచ్చు. వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. భాగస్వాములతో సమస్యలు తీరతాయి.

ఉద్యోగస్తులకు పదోన్నతులు రాగలవు.

విధి నిర్వహణ ఆశాజనకంగా ఉంటుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces