Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Capricorn

మకరం

అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ప్రముఖులతో పరిచయాలు.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

అనుకున్నదే తడవుగా సొమ్ము అందుతుంది.

దీర్ఘకాలిక రుణాలు సైతం తీరుస్తారు.

షేర్లు క్రయవిక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుకుంటారు.

ఒకరి వద్ద నుంచి ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది.

కుటుంబం లో అందరిలోనూ నైపుణ్యతను చాటుకుంటారు.

సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి.

సంతానం ఉద్యోగం పై నెలకొన్న నీలి నీడలు తొలగి ఊరట చెందుతారు.

భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

ఆరోగ్యం మరింత మెరుగుదల కనిపిస్తుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు వివిధ రూపాల్లో సమకూరుతుంది.

బ్యాంకు రుణాలు తీరతాయి.

భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది.

విస్తరణ యత్నాలు సానుకూలమవుతాయి.

ఉద్యోగాలలో అనుకోని ప్రమోషన్లు లభించవచ్చు.

ఉన్నతాధికారులు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.

కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వర స్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces