Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Capricorn

మకరం

మొదట్లో కొంత వ్యతిరేకత, సమస్యలు ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది.

భవిష్యత్తు పై నిరుద్యోగులకు భరోసా కలుగుతుంది.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

మీ నేర్పరితనం, ఓర్పు వల్ల కొన్ని సమస్యలు దూరం కాగలవు.

తరచూ తీర్థయాత్రలు చేస్తారు.

ఇంటి నిర్మాణాలలో కదలికలు కనిపిస్తాయి.

మిత్రుల చేయూతతో పనుల్లో విజయాలు సాధిస్తారు.

రావలసిన సొమ్ము కొంత జాప్యం జరిగినా అందుకుంటారు.

అయితే రుణ దాతల ఒత్తిడులు పెరుగుతాయి.

ఆస్తుల విక్రయాల వల్ల అనుకున్న సమయానికి కాకుండా ఆలస్యంగా డబ్బు అందే అవకాశాలు.

మొత్తం మీద ఇబ్బందులు లేకుండానే గడుస్తుంది.

కుటుంబ సభ్యులు మీపట్ల అభిప్రాయాలను మార్చుకుంటారు.

ఇంతకాలం  మిమ్మల్ని వ్యతిరేకించిన వారు సైతం అనుకూలురుగా మారే సూచనలు.

భవిష్యత్తు పై మరింత భరోసా ఏర్పడుతుంది.

వివాహా వేడుకల నిర్వహణ పై దృష్టి సారిస్తారు.

సంతానం ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టినా క్రమేపీ ఊరట కలుగుతుంది.

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వైద్యుల సలహాలు పొందుతారు.

వ్యాపారాలలో మరింత లాభాల కోసం చేసే యత్నాలు నిదానిస్తాయి.

పెట్టుబడులకు లోటులేకున్నా నిర్వహణాలోపం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి.

విధి నిర్వహణలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు, ఉన్నతాధికారులు మీపై ఒత్తిడులు పెంచుతారు.

అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి

రాజకీయవేత్తలు, కళాకారులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు ఆస్తుల విషయంలో లాభాలు కలుగుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces