Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Capricorn

మకరం

భవిష్యత్తు పై మరింత భరోసా కలుగుతుంది.

ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు.

పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

చీటికీ మాటికీ ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

రావలసిన సొమ్ములు అందుతాయి.

ఆస్తులు, షేర్ల విక్రయాలు కూడా లాభించి మరింత సొమ్ము అందుకుంటారు.

మీ అంచనాలకు తగినట్లుగానే ధనం సమకూరుతుంది.

కుటుంబంలో మీ నేర్పరితనం, పట్టుదల కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి.

వివాహది శుభకార్యాలకు నేతృత్వం వహిస్తారు.

కొన్ని నిర్ణయాలు బంధువులను మెప్పిస్తాయి.

సంతానపరంగా శుభవార్తలు వింటారు.

ఆరోగ్యపరంగా మరింత మెరుగైన జీవనం సాగిస్తారు.

వైద్యసేవలు విరమిస్తారు.

వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులు అందుకుంటారు.

కొత్త భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు.

విశేష గుర్తింపు పొందుతారు.

ఒత్తిడుల నుంచి బయటపడతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

అవార్డులు , పురస్కారాలు సైతం అందుకుంటారు.

మహిళలకు సోదరీలతో సఖ్యత నెలకొంటుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces