Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Capricorn

 

మకరం

పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధిస్తారు.

పలుకుబడి పెంచుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు.

కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు.

నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తుంది.

రుణాలు సైతం తీరతాయి.

ఆస్తులు, షేర్ల కొనుగోలులో పెట్టుబడులు పెడతారు.

ఇతరులకు ఇచ్చిన హామీ మేరకు ఇంతకాలం పడిన ఒత్తిడులు తొలగుతాయి.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది.

శుభకార్యాల సందడి నెలకొంటుంది.

సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి.

ప్రథమ సంతానం ఉద్యోగవిషయంలో చిక్కులు తొలగుతాయి.

ఆరోగ్యపరంగా స్వస్థత చేకూరి ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు.

ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రావచ్చు.

పనిభారం నుంచి విముక్తి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు సంతోషకరమైన సమాచారం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces