Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Capricorn

 

మకరం

ఆశ్చర్యకరమైన విధంగా పనులు పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మరింత సాయం అందిస్తారు.

అరుదైన ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు.

పలుకుబడి పెరుగుతుంది.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ఉద్యోగాలు పొందుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు.

రావలసిన సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి.

మొండి బాకీలు సైతం వసూలవుతాయి.

ఖర్చులు అదుపు చేసుకుని పొదుపు పాటిస్తారు.

షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత డబ్బు లభిస్తుంది.

కుటుంబంలో అందరి ప్రేమాభిమానాలతో ముందుకు సాగుతారు.

మీ విజయాల పై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తారు.

వివాహ వేడుకలు నిర్వహిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో పెట్టుబడులకు లోటు ఉండదు.

కొత్త భాగస్వాములతో కళకళలాడుతుంటాయి.

ఉద్యోగాలు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces