పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Gemini

మిథునం..

పనులలో కొంత జాప్యం. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. గృహ, వాహనయోగాలు. కోర్టు కేసులు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లబిస్తాయి. ఐటీనిపుణులకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో కొద్దిగా లాభాలు. మృగశిర 3,4పాదాల వారికి సోమవారం కీలక నిర్ణయాలు. కార్యజయం. బుధవారం పనులలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరుద్ర వారికి ఆదివారం వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. గురువారం శుభవార్తలు. వాహనయోగం. పునర్వసు 1,2,3పాదాల వారికి సోమవారం ఆస్తి వివాదాలు. చోరభయం. బుధవారం చర్చలు ఫలించవు. వ్యయప్రయాసలు

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces