Weekly Horoscope
2nd December, 2018 to 8th December, 2018
Gemini
మిథునం
విమర్శించిన వ్యక్తులే మిమ్మల్ని ఆకాశానికెత్తుతారు.
శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
పనుల్లో విజయం చేకూరుతుంది.
విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.
వాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆలోచనలు తక్షణం అమలు చేసి ముందడుగు వేస్తారు.
కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.
అప్పులు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి.
ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా డబ్బు సమకూరుతుంది.
కుటుంబంలో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.
బంధువులతో శుభకార్యాల పై చర్చిస్తారు.
సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.
కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.
విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.
సోదరులతో ఆనందంగా గడుపుతారు.
శారీరక రుగ్మతలు చాలావరకూ తీరతాయి.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు.
భాగస్వాములతో మరింత సఖ్యత నెలకొంటుంది.
ఉద్యోగాలలో మీ పై ఉంచిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు.
ఇంక్రిమెంట్లు రావచ్చు.
కళాకారులకు నూతన అవకాశాలు, సన్మానాలు.
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.
శివపంచాక్షరి పఠించండి.