Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Gemini

మిథునం

మీ ఖ్యాతి, పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి.

సమస్యల బారి నుంచి బయటపడతారు.

వాహనాలు, గృహం కొనుగోలులో ముందడుగు వేస్తారు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు.

నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు.

కొంత సొమ్ము అనుకోకుండా అంది అవసరాలు తీరతాయి.

రుణ బాధల నుంచి విముక్తి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధనలబ్ధి.

కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు.

ద్వేషించిన వారే ప్రశంసిస్తారు.

సంతానం ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు.

వివాహయత్నాలు కలసి వస్తాయి.

కొన్ని రుగ్మతలు కలిగినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. భాగస్వాములు పెట్టుబడులు పెంచుతారు.

కొన్ని వివాదాలు తీరతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది.

మహిళలకు సోదరుల నుంచి శుభవార్తలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces