Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Gemini

మిథునం

మిమ్మల్ని ద్వేషించినా వారే అభిమానిస్తారు.

ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు.

చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి.

వాహనాలు ఆభరణాలు కొంటారు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

ఇంటి నిర్మాణాల్లో ఆవాంతరాలు అధిగమిస్తారు.

పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కొంత సొమ్ము సకాలంలో అందుకుని ఉత్సాహంగా గడుపుతారు.

ఆస్తుల విక్రయాలు లాభిస్తాయి.

ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు సహకరించే వారు పెరుగుతారు.

కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా మసలుతారు.

శుభకార్యాలలో పాల్గొంటారు.

సోదరులు, ఇతర బంధువులతో మరింత సంతోషంగా గడుపుతారు.

మీ నిర్ణయాల కోసం అంతా ఎదురు చూడడం విశేషం.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో క్రమేపీ ఆశించిన లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులకు ఇబ్బందులు ఉండవు.

భాగస్వాములతో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.

ఉద్యోగస్తులు ఒడిదుడుకులు, ఒత్తిళ్లు నుంచి బయటపడతారు.

ఉన్నతశ్రేణి వారి నుంచి సహాయం అందుకుంటారు.

రాజకీయవేత్తలు,కళాకారులకు ఆశించిన అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces