Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Gemini

మిథునం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కొన్ని విషయాలలో పట్టింది బంగారమే కాగలదు.

సన్ని్నహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి.

ఎంతటి వారినైనా నేర్పరితనంతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది.

ఊహించిన దానికంటే అధికంగానే ధనం సమకూరుతుంది.

ఆస్తుల విక్రయాల ద్వారా రావలసిన సొమ్ము కూడా అందుతుంది.

కుటుంబం లో మీపై వచ్చిన అపోహలు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

సహనం, ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది.

వైద్య సేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలు అనుకున్న విధంగా  విస్తరిస్తారు.

పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలు పదోన్నతులు రావచ్చు.

అంచనాల మేరకు మార్పులు జరిగే వీలుంది.

కళాకారులు మరింత ఉత్సాహంతో సాగుతారు.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది .

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces