Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Gemini

మిథునం

కొన్ని ముఖ్య కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు.

అయితే పట్టుదలతో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో మనస్పర్ధలు నెలకొంటాయి.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మనస్సులోని భావాలను వెల్లడిస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

ఇంటి నిర్మాణ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

రావలసిన సొమ్ము అందక మరింత ఇబ్బంది ఏర్పడుతుంది.

అవసరాలు తీరక కొంత అయోమయానికి లోనవుతారు.

కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి.

బంధువులు మీపట్ల కొంత కఠిన వైఖరి అనుసరిస్తారు.

మీ నిర్ణయాలను వ్యతరేకిస్తారు.

అలాగే, సంతానం నుంచి కూడా ఒత్తిళ్లు తప్పవు. 

సహనంతో మెలగడం మంచిది.

శారీరక రుగ్మతలు బాధపెట్టవచ్చు.

వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి.

సమయానికి పెట్టుబడులు సైతం అందక డీలాపడతారు.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు ఎదురుకావచ్చు.

అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.

మహిళలకు మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces