Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Gemini

మిథునం

చేపట్టిన పనులు పూర్తి చేసేవరకూ విడిచిపెట్టరు.

ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సందేశం అందుతుంది.

స్వాములు, పండితులను కలుసుకుంటారు.

ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.

వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఆర్థికంగా సొమ్ముకు లోటు రాదు. ఏదోవిధంగా అవసరాలు తీరతాయి. స్నేహితులు సైతం సహకరిస్తారు.

షేర్లలో పెట్టుబడులపై తొందరపాటు వద్దు.

మొత్తం మీద సాఫీగానే సాగుతుంది.

కుటుంబంలో మీపట్ల కుటుంబ సభ్యులు అభిప్రాయాలను మార్చుకుంటారు. సానుకూల వైఖరి అనుసరిస్తారు.

బంధువులతో విభేదాలు తొలగుతాయి.

సంతానపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు.

వ్యాపారాలలో లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

నూతన పెట్టుబడులు సైతం అందుకుంటారు.

ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

మహిళలకు సంఘంలో గౌరవం పెరుగుతుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ ఖడ్గమాల పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces