Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Gemini

మిథునం

అనుకున్న కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, స్నేహితులతో స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు.

మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

పరిచయాలు పెరుగుతాయి.

ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

పాత మిత్రులను కలుసుకుని గతం గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా అవసరాలకు లోటు ఉండదు.

అయితే గతంలో చేసిన రుణాలపై ఒత్తిడులు ఉండవచ్చు.

షేర్ల కొనుగోలులో కొంత నిదానం పాటించడం ఉత్తమం.

కుటుంబ పెద్దల నుంచి మీపై  వివాహాల విషయంలో కొంత ఒత్తిడులు ఉండవచ్చు.

బంధువుల రాకతో పండుగ వాతావరణం నెలకొంటుంది.

సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తి పంపకాలు వాయిదా వేస్తారు.

ఆరోగ్యపరంగా స్వల్ప అస్వస్థత, తద్వారా వైద్య సేవలు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

అయితే పెట్టుబడులకు మాత్రం ఇబ్బంది ఉండదు.

ఉద్యోగాలలో ఎంతటి బాధ్యత అప్పగించినా భయపడకుండా పూర్తి చేస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces