Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Gemini

మిథునం

ఎంత కష్టపడ్డా అనుకున్న పనులు పూర్తి కాక దిగాలు చెందుతారు.

మీరు ఆదుకున్న వారు సైతం ముఖం చాటేస్తారు.

స్నేహితులు, శ్రేయోభిలాషులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

కాంట్రాక్టులు కోసం చేసే యత్నాలు ముందుకు సాగవు.

ఒక సమాచారం కొంత గందరగోళం పెట్టవచ్చు.

ఉద్యోగయత్నాలలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

అవసరాలకు తగినంత సొమ్ము సమకూరక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది.

మీ ద్వారా డబ్బు పొందిన వారి నుంచి కూడా సమస్యలు ఎదురుకావచ్చు.

సోదరులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి.

మీ సలహాలు, సూచనలు కుటుంబ సభ్యులు తిరస్కరించే వీలుంది. సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురై మనస్తాపం కలిగిస్తాయి.

అకాల ఆహారవిహారాదుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. వైద్య సేవలు సైతం పొందుతారు.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు కనిపించినా పెట్టుబడులు నిరాశ పరుస్తాయి.

ఉద్యోగాలలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి.

అంకితభావంతో పనిచేసినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.

మహిళలకు మానసిక అశాంతి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces