Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Leo

సింహం

మీపై వచ్చిన ఆరోపణలు నిజం కావని నిరూపితమవుతుంది.

మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

చాకచక్యంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.

ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు.

గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొని ప్రతిభ చాటుకుంటారు.

ఎంతోకాలంగా ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆశ్చరపడతారు.

అలాగే, రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.

కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయి.

కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.

సంతానపరంగా ముఖ్యంగా మొదటి సంతానం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

విశ్రాంతి నుంచి బయటపడి సాధారణ జీవనం సాగిస్తారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

విస్తరణయత్నాలు కలసివస్తాయి.

ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

రాజకీయవేత్తలకు పదవీయోగం.

ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కీలక సమాచారం అందుతుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces