Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Leo

సింహం

మొదట్లో కొంత సబ్దుగా ఉన్నా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి.

విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి

ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.

తీర్థయాత్రలు చేస్తారు.

ఆర్థికంగా మరింత అనుకూలిస్తుంది.

ఇబ్బందులు తొలగుతాయి.

ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ది చేకూరుతుంది.

భార్యాభర్తల మధ్య సఖ్యత.

మొదటి సంతానం రీత్యా శుభవార్తలు, వివాహాది శుభకార్యాల నిర్వహణ పై దృష్టి సారిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.

కీలక వ్యక్తి అందించే సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

అరమరికలు, దాపరికాలు లేకుండా నిర్మొహమాటంగా మనస్సులోని అభిప్రాయాలను వెల్లడిస్తారు.

శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి.

విస్తరణ యత్నాలు సానుకూలం.

ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి సత్తా చాటుకుంటారు.

పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces