Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Leo

సింహం

ఈవారం పనులు అనుకున్న విధంగా ముందుకు సాగవు.

కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి.

మిత్రులతో వైరం. లేనిపోని తగాదాలు.

ఎదుటవారి విషయాలలో జోక్యం వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు.

కాంట్రాక్టర్లు అవకాశాలు చేజార్చుకుంటారు.

రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందిపడతారు. రుణాలు చేస్తారు.

ఆస్తుల క్రయవిక్రయాలలో ఆశించినంతగా డబ్బు అందక అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు.

మంచి మాట్లాడినా మీ పై నిందలు మోపుతారు. కుటుంబ సభ్యులతో తగాదాలు.

మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు.

సంతానం నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.

బంధువుల రాక కొంత సంతోషం కలిగిస్తుంది.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

తరచూ ఏదో సమస్య ఎదురవుతునే ఉంటుంది.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. పెట్టుబడులకు అన్వేషిస్తారు. భాగస్వాములతో కలహాలు.

ఉద్యోగాలలో పదోన్నతులు చేజారవచ్చు. పనిభారం పెరుగుతుంది.

రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు మానసిక అశాంతి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces