Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Leo

సింహం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

మిత్రులు మీపట్ల విధేయత చూపుతారు.

అలాగే వారి సలహాలు పాటిస్తారు.

ఆస్తి వివాదాలు తీరి అనుకున్నరీతిలో లబ్ధి పొందుతారు.

నిరుద్యోగులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు.

ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.

వాహనాలు,ఆభరణాలు కొంటారు.

రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

షేర్ల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

మీ మంచితనమే శ్రీ రామరక్షగా నిలుస్తుంది.

భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది.

ఆరోగ్యం విషయంలో మెరుగుదల కనిపిస్తుంది.

వైద్య సేవలు కొంత తగ్గిస్తారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు.

ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

కొన్ని చికాకులు తొలగుతాయి.

రాజకీయవర్గాలలో కొత్త పదవులు లభించి సన్మానాలు పొందుతారు.

మహిళలకు సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి.

శుభవార్తలు అందుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces