Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Leo

సింహం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి.

ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది.

వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు, వస్తులాభాలు ఉంటాయి.

సొమ్ముకు లోటు రాకుండా గడుస్తుంది.

రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి ఉండవచ్చు.

షేర్లు, భూముల విక్రయాలు వల్ల మరింత సొమ్ము సమకూరే సూచనలు.

కుటుంబంలో మీ ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులు పులకిస్తారు.

వేడుకలు నిర్వహిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి.

మీరు అనుకున్నట్టే నిర్ణయాలు జరిగి మరింత సంతోషంగా గడుపుతారు.

శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

లాభాలు సైతం ఆశించినంతగా లభిస్తాయి.

ఉద్యోగాలలో పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి.

కోరుకున్న విధంగా పదోన్నతులు రాగలవు.

రాజకీయవర్గాలకు పదవీయోగం.

మహిళలకు ఆస్తి, ధన లాభాలు కలుగుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ పంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces