Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Leo

సింహం

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మీ పై స్నేహితులు మరింత ప్రేమానురాగాలు చూపుతారు.

చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు.

సొమ్ముకు ఇబ్బంది ఉండదు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది.

రుణాలు తీరి ఊరట లభిస్తుంది.

ఆస్తుల విక్రయాలు కూడా పూర్తయి కొంత ధనప్రాప్తి కలుగుతుంది.

కుటుంబంలో పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు.

అందరి ప్రేమను పొందుతారు.

సంతానపరంగా మరింత సౌఖ్యం.

భార్యాభర్తల మధ్య ఇంతకాలం నెలకొన్న వివాదాలు తీరతాయి.

ఆరోగ్యపరంగా కొంత అస్వస్థత కలిగినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంతో సాగుతారు.

ఉద్యోగాలలో మీరు అనుకున్న హోదాలు దక్కవచ్చు. పై స్థాయి వారు మరింత చేయూతనందిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces