Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Leo

సింహం

ఎంతగా కష్టపడ్డా అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు.

వ్యయప్రయాసలు అధికమవుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.

ప్రస్తుత పరిస్థితులు కూడా మీకు తలనెప్పిగా మారి ఇబ్బంది కలిగించవచ్చు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వివాదాలు పరిష్కారంలో కొంత చొరవ చూపినా ఫలితం కనిపించదు.

ఇంటి నిర్మాణయత్నాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అదిగమిస్తారు.

చిరకాల మిత్రులతో ఉత్తరప్రత్తుత్తరాలు సాగిస్తారు.

చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

రుణ సేకరణ తప్పదు.

మరోవైపు ఆస్తుల విక్రయాలు స్థంభించి రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు.

సంతానం ఆరోగ్యం పై కొంత కలత చెందుతారు.

కొన్ని వేడుకలు చివరిలో వాయిదా వేస్తారు.

సోదరులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి.

ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకావచ్చు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో కొంతమేర లాభాలు అందుతాయి.

పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు.

ఉద్యోగస్తులు అదనపు పని భారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

కొన్ని మార్పులు కూడా జరిగే వీలుంది.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు సోదరీలతో వివాదాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces