Weekly Horoscope

4th August, 2019 to 10th August, 2019

Libra

తుల

ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

కొన్ని వివాదాలు, సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

వాహనాలు, స్థలాలు కొంటారు.

మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విజయం సాధిస్తారు.

పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఇతరుల నుంచి ఊహించని రీతిలో సొమ్ము అందుతుంది. రుణ బాధలు తొలగుతాయి.

ఆశ్చర్యకరమైన విధంగా డబ్బు సమకూరుతుంది.

అయితే హామీల విషయంలో మాత్రం తొందరపడవద్దు.

మీపట్ల కుటుంబసభ్యులంతా మీపట్ల విశేష ప్రేమ చూపుతారు.

అలాగే, మీ అభిప్రాయాలను గౌరవిస్తారు.

వేడుకలు, ఉత్సవాల పై చర్చిస్తారు.

పెద్దల సూచనలు అనుసరిస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు. సోదరీలు, సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.

కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు.

వ్యాపారాలు ఊహించని రీతిలో లాభాలు ఆర్జిస్తారు.

నూతన పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు అంచనాలు నిజమవుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces