Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Libra

తుల

కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు పరీక్షగా మారతాయి.

మీ ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.

విద్యార్థులకు శ్రమాధిక్యం,అనుకున్న అవకాశాలు కొన్ని దూరం కాగలవు.

గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి.

మిత్రులు, శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలను పక్కనబెడతారు.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురై గందరగోళం చెందుతారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థికంగా రావలసిన డబ్బు అందక ఇబ్బందులు పడతారు.

రుణాలు సైతం సకాలంలో అందవు.

ఇతరులకు గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు సమస్యగా మారే సూచనలు.

మొత్తం మీద ఖర్చులు, రాబడి సమతూకం పాటించే చర్యలు తీసుకుంటే మంచిది.

కుటుంబంలో ఇతరుల మేలు కోసం తీసుకునే నిర్ణయాలు మీకే సవాలుగా మారే సూచనలు.

బంధువులు ఒత్తిడులు పెంచుతారు.

భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు నెలకొంటాయి.

సంతానం నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం కొంత మెరుగుపడినా వైద్య సేవలు కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుంది.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది.

కొత్త పెట్టుబడులు ఆలస్యమవుతాయి.

భాగస్వాముల పట్ల అప్రమత్తంగా మెలగండి.

ఉద్యోగాలలో పదోన్నతులు తృటిలో తప్పిపోయే సూచనలు.

విధుల్లోనూ బాధ్యతాయుతంగా మెలగడం మంచిది.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces