Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Libra

తుల

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సమాజసేవలో పాలుపంచుకుంటారు.

కొన్ని ఈతి బాధలు, ఒత్తిడుల నుంచి బయటపడతారు.

తీర్థయాత్రలు చేస్తారు.

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

కాంట్రాక్టర్లకు శుభదాయకంగా ఉంటుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది.

ఆకస్మిక ధనలబ్ధి. రుణ బాధలు తొలగుతాయి.

ఏమాత్రం ఇబ్బంది లేకుండా గడిచేందుకు మార్గం ఏర్పడుతుంది. షేర్లు, భూముల విక్రయాల వల్ల కొంత సొమ్ము దక్కుతుంది.

మీ ప్రేమాభిమానాలతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తారు. ఇంతకాలంగా మిమ్మల్ని ఎందుకు విమర్శించామా అని బంధువులు సైతం బాధపడతారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

ఆరోగ్యపరంగా కొన్ని రుగ్మతల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు.

వ్యాపారాలు,లాభాల దిశగా సాగుతాయి.

నూతన పెట్టుబడులు అందుకుంటారు.

ఉద్యోగస్తులు సమస్యలు అధిగమించి ముందడుగు వేస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలత.

మహిళలు కొన్ని సమస్యలను పరిష్కరించకుంటారు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీ గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces