Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Libra

తుల

ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయడం మంచిది.

ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి.

శ్రమానంతరం కొంత ఫలితం కనిపిస్తుంటుంది.

వివాదాలకు దూరంగా మెలగండి.

స్నేహితులు, శ్రేయోభిలాషులతోనూ విభేదిస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఉద్యోగయత్నాలు ముందుకు సాగక డీలా పడతారు.

ఆస్తుల వ్యవహారాలు క్లిష్టంగా మారి గందరగోళం పెట్టవచ్చు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రావలసిన సమయానికి డబ్బు అందక ఇబ్బందులు పడాల్సివస్తుంది.

రుణ దాతలు ఒత్తిడులు పెంచుతారు.

ఆస్తుల విక్రయాలలోనూ ప్రతిష్ఠంభన వల్ల డబ్బు ఎక్కడికక్కడ నిలిచిపోయే సూచనలు.

కుటుంబంలో మీపై ప్రేమ కనబరచిన వారే శత్రువుల్లా మారవచ్చు.

సోదరులు, సోదరీలతోనూ విభేదాలు నెలకొంటాయి.

మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు రుచించవు.

సంతానం విద్య, ఉద్యోగ విషయాల పై కొంత ఆందోళన  చెందుతారు.

ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. తరచూ వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారాలపెట్టుబడులలోనూ అవాంతరాలు ఎదురుకావచ్చు. భాగస్వాములతో వైరం. విస్తరణ కార్యక్రమాలు నిలిచిపోవచ్చు.

ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు.

ఉన్నత స్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు.

మహిళలు మానసిక అశాంతికి లోనవుతారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces