Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Libra

తుల

అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి.

ఆప్తులు సైతం మీపై నెపాలు మోపుతారు.

ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.

ఆస్తుల విషయంలో సందిగ్ధత నెలకొంటుంది.

స్నేహితుల నుంచి మాటసహాయం అందుతుంది.

కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వాహన యోగం.

ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలకు రుణాలు చేస్తారు.

ఆస్తుల విక్రయాలు స్తంభించి పోయి తద్వారా రావలసిన సొమ్ము సైతం ఆలస్యమవుతుంది.

మొత్తం మీద ఉన్న సొమ్ము జాగ్రత్తగా వాడుకుంటే మేలు.

కుటుంబంలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి.

భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొంటాయి.

కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.

సంతానపరంగా సమస్యలు ఎదుర్కొటారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు ఆశించిన లాభాలు అందకున్నా పెట్టుబడులకు ఢోకా ఉండదు. భాగస్వాములతో కొద్దిపాటి తగాదాలు.

ఉద్యోగాలలో అనుకోని మార్పులు తథ్యం.

అదనపు బాధ్యతలు, పని భారంతో సతమతమవుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.

మహిళలకు మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces