Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Libra

తుల

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.

ఆత్మీయుల నుంచి అందిన సమాచారంతో కాస్త ఊరట చెందుతారు.

నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రభావం కొంత ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

రావలసిన డబ్బు అందుతుంది.

అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది.

రుణాలు తీరతాయి.

కుటుంబంలో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు.

బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు.

ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి.

ఆరోగ్యపరంగా కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి.

అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి చేస్తారు.

ఉద్యోగస్తులు విధుల్లో నెలకొన్న సమస్యలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు.

పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కాస్త అనుకూలత ఉంటుంది.

మహిళలకు స్వల్ప ధనలాభం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ పంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces