పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Pisces

మీనం

ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు.

శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారతారు.

ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు.

దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు.

సేవలకు గుర్తింపు రాగలదు.

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునరుద్ధరిస్తారు.

వాహన యోగం. వ్యాపారులకు అధిక లాభాలు.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి పురస్కారాలు.

కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయం అందుకుంటారు.

పూర్వాభాద్ర 4వపాదం వారికి ఆదివారం  నూతన ఉద్యోగప్రాప్తి. సన్మాన,సత్కారాలు. బుధవారం మానసిక ఆందోళన. చోరభయం.

ఉత్తరాభాద్ర వారికి సోమవారం విరోధాలు. శ్రమాధిక్యం. గురువారం విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. 

రేవతి వారికి బుధవారం చోరభయం. మిత్రులతో కలహాలు. శనివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

పశ్చిమ దిశ ప్రయాణాలు సానుకూలం.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces