Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Pisces

మీనం

మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. ఆత్మవిశ్వాసం, నేర్పుతో ముందడుగు వేసి సమస్యలు అధిగమిస్తారు. 

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

తీర్థయాత్రలు విస్తృతంగా చేస్తారు.

ఇతరులకు సైతం సాయం అందించి ప్రశంసలు అందుకుంటారు.

ఆర్థిక పరిస్థితి క్రమేపీ పుంజుకుంటుంది.

రావలసిన బాకీలు కొన్ని వసూలవుతాయి. 

కుటుంబంలో మీ పై వచ్చిన అపవాదులు తొలగుతాయి.

మీరంటే ఏమిటో, మీ మంచితనం అందరూ గుర్తిస్తారు.

మీ పట్ల మరింత ఆదరణ చూపుతారు.

ప్రథమ సంతానం విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. వేడుకలు నిర్వహిస్తారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది.

కొద్దిగా రుగ్మతలు బాధించినా ఉపశమనం లభిస్తుంది.

నూతన భాగస్వాముల చేరికతో వ్యాపారాలు విస్తరిస్తారు.

ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న ఇంక్రిమెంట్లు రాగలవు.

ఆశ్చర్యకరమైన రీతిలో పదోన్నతులు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కుటుంబంలో చిక్కులు తొలగుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces