Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Pisces

మీనం

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.

కొన్ని వివాదాలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.

మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు.

నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు.

ఇంతకాలం పడిన కష్టాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

నూతన వ్యక్తులు పరిచయమవుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.

ఆస్తులు విక్రయాల వల్ల కొంత సొమ్ము సమకూరుతుంది.

రుణాలు చాలవరకూ తీరి ఊరట చెందుతారు.

కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది.

ఇంతవరకూ మీరంటే ఇష్టపడని వారు సైతం మీకు సహకరిస్తారు.

సోదరులు,సోదరీలతో సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు.

సంతానం లోని ఒకరి వివాహ యత్నాలు కలసి వస్తాయి.

మొత్తం మీద సంతోషదాయకమైన వాతావరణం నెలకొంటుంది.

కళాకారులకు అవార్డులు రాగలవు.

విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు.

మహిళలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces