Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Pisces

మీనం

అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు.

ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

ఆర్థికం గా కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

ఆస్తుల విక్రయాల ద్వారా మరింత సొమ్ము అందుతుంది.

కొన్ని ఆర్థిక వివాదాల నుంచి గట్టెక్కుతారు.

మొత్తం మీద ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి.

కుటుంబం లో పెద్దల సూచనలు, సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని వేడుకలు నిర్వహిస్తారు.

మీ అభిప్రాయాల మేరకు కుటుంబసభ్యులు మసలుకొని చేదోడుగా నిలుస్తారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ఒకరికి విదేశీ ఉద్యోగాలు దక్కి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు.

నూతన పెట్టుబడులకు సమయమిదే.

ఉద్యోగాల లో మీ హోదాలు పెరుగుతాయి.

సహచర ఉద్యోగాలు మీకు సహాయపడి పనిభారం తగ్గిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

మహిళలకు శుభ వర్తమానాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces