Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Pisces

మీనం

ప్రముఖులతో పరిచయాలు.

సంఘంలో మీదే పై చేయిగా ఉంటుంది.

సన్నిహితులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు.

వాహనాలు, భూములు కొంటారు.

శత్రువులను సైతం ఆకట్టుకుని ప్రశంసలు పొందుతారు.

అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు నిరుద్యోగులకు ఊరటనిస్తాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

మీ ఖ్యాతి మరింత పెరిగినా సామాన్యంగానే గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ఆర్థికంగా రావలసిన సొమ్ము అందుతుంది.

ఆకస్మిక ధన లాభాలు ఉండవచ్చు.

ఆస్తుల విక్రయాలు జరిగి ఆ డబ్బు సైతం అందుకుంటారు.

మొత్తంమీద వారమంతా ధనానికి ఇబ్బంది లేకుండా గడుస్తుంది.

కుటుంబంలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది.

మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.

ఆరోగ్యపరంగా కొద్దిపాటి రుగ్మతలు ఎదురైనా అధిగమిస్తారు.

వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.

పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

ఉద్యోగస్తులు విధులు ప్రశాంతంగా నిర్వహిస్తారు.

మీ సామర్థ్యం వెలుగులోకి వస్తుంది.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces