Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Pisces

మీనం

వీరికి అన్నీ శుభసూచకాలే.

కొంతకాలంగా పెండింగ్‌లో పడిన కార్యక్రమాలు సైతం పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థికంగా సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది.

ఇతరుల నుంచి రావలసిన సొమ్ములు కూడా అందుతాయి.

మొత్తం మీద గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది.

కుటుంబంలో  మీ విధానాలు, నడవడిక పట్ల కుటుంబ సభ్యులు ఆకర్షితులవుతారు.

శుభకార్యాల పై చర్చలు సాగిస్తారు.

ఏ మాత్రం భయపడకుండా మనస్సులోని భావాలను వెల్లడిస్తారు.

ఆరోగ్యపరంగా స్వల్ప అస్వస్థత కలిగినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో కోరుకున్న విధంగా మార్పులు జరుగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces