Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Pisces

మీనం

ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే.

ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు.

విద్యార్థులు ఊహించని అవకాశాలు పొందుతారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

చీటికీ మాటికీ ఎదురవుతున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

ఆస్తుల విషయంలో నెలకొన్న చికాకులు తొలగి లబ్ధి పొందుతారు.

కొత్త ఉద్యోగాన్వేషణలో పురోగతి సాధిస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఒక సమాచారం కొంత గందరగోళం కలిగించవచ్చు.

మీ అభిప్రాయాలతో మిత్రులు కొంత విభేదిస్తారు.

ఆర్థికంగా ఆశించినంత ఆదాయం సమకూరుతుంది.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

స్థిరాస్తి విక్రయాలు సకాలంలో పూర్తి చేసి కొంత ధనం పొందుతారు.

కుటుంబంలో మీ ప్రేమాభిమానాలతో కుటుంబంలోని ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటారు.

అందరికీ మీరే దిక్సూచిగా నిలుస్తారు.

పెద్దల నుంచి సూచనలు స్వీకరిస్తారు.

ఆరోగ్యం కొంత మందగించినా తక్షణ ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు కొంత నిదానంగా సాగినా పెట్టుబడులు, లాభాలు అందుతాయి. భాగస్వాముల నుంచి చికాకులు తొలగుతాయి.

ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది.

ఉన్నతాధికారులు మీకు మరింత సహాయ పడతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

సత్కారాలు జరుగుతాయి.

మహిళలకు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces