Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Pisces

మీనం

కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు.

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి.

కాంట్రాక్టర్లకు శుభదాయకమైన కాలం.

చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పలుకుబడి మరింత పెరుగుతుంది.

యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకర్షిస్తారు.

రావలసిన సొమ్ము సమకూరుతుంది.

అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది.

అలాగే, షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు.

మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు ఏకీభవిస్తారు.

సంతానం వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు.

సోదరులు,సోదరీల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది.

స్వల్ప అనారోగ్య సూచనలు, వైద్య సేవలు.

వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. తగినంత లాభాలు అందుతాయి.

ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు.

ఉన్నతాధికారులు మరింత చేయూతనందిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడుల నుంచి విముక్తి.

మహిళలకు వివాదాలు తీరతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces