Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Pisces

మీనం

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కుతారు.

నిలిచిపోయిన పనులు కూడా చక్కదిద్దుతారు.

ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త వ్యక్తుల పరిచయాలు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పాత మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

ఆర్థికంగా సొమ్ముకు ఇబ్బందులు లేకుండా గడుపుతారు.

ఆస్తులు విక్రయాలలో అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది.

కొంత మేర రుణాలు సైతం తీరతాయి.

కుటుంబ సభ్యుల వైఖరి మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ సర్దుకుంటుంది.

సోదరులతో సఖ్యత నెలకొంటుంది.

విదేశాలలోని సంతానం క్షేమసమాచారాలు ఉత్సాహాన్నిస్తాయి.

ఆరోగ్యం కాస్త మెరుదల కనిపిస్తుంది.

వైద్య సేవలు కొనసాగిస్తారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలతో ముందుకు సాగుతారు.

కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు.

ఉద్యోగస్తులు విధులలో ఆటంకాలు అధిగమిస్తారు. సందిగ్ధత తొలగుతుంది.

ఉన్నతాధికారులు మీపట్ల ఆదరణ చూపుతారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒక కీలక సమాచారం అందుతుంది.

మహిళలకు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces