పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Sagittarius

ధనుస్సు

ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి.

అయితే క్రమేపీ మీరనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

ఆర్థిక విషయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

ఇంతకాలం వేధించిన ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి.

ఇరుగుపొరుగు నుంచి ఆశించిన సాయం అందుతుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు.

ఉద్యోగులకు శ్రమ తగ్గి ఉపశమనం లభిస్తుంది.

రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు.

షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

మూలా నక్షత్రం వారికి మంగళవారం ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. గురువారం బంధువులతో సఖ్యత. ఆస్తి లాభాలు.

పూర్వాషాఢ వారికి మంగళవారం మానసిక అశాంతి. చోర భయం. గురువారం విందువినోదాలు. స్వల్ప ధన లాభం.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. శుక్రవారం కార్య జయం. బంధువుల కలయిక.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces