Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Sagittarius

ధనుస్సు

కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు. పరపతి పెరుగుతుంది.

సంఘంలో గౌరవం.

మీ ఆశయాల సాధనలో కుటుంబmసభ్యుల తోడ్పాటు లభిస్తుంది.

సేవకార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త కాంట్రాక్టులు చేపడతారు.

వ్యాపారులు గతంలోని నష్టాల నుంచి గట్టెక్కుతారు.

ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పదోన్నతి అవకాశాలు.

పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు.

కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. 

రాజకీయవర్గాల వారు కొత్త పదవులు పొందుతారు.

విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు.

ఐటీ రంగం వారికి విధి నిర్వహణలో ప్రశంసలు.

వ్యవసాయదారులకు బ్యాంకు రుణాలు అందుతాయి.

మహిళలు ఉత్సాహంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధిస్తారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మూల నక్షత్రం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గురువారం విందువినోదాలు. కార్యసిద్ధి.

పూర్వాషాఢ వారికి మంగళవారం వివాదాలు. చోరభయం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం. 

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. బుధవారం వాహనయోగం. చర్చల్లో పురోగతి.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces