Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Sagittarius

ధనుస్సు

మీ సత్తా నిరూపించుకునేందుకు తగిన సమయం.

విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న ప్రగతి సాధిస్తారు.

వ్యూహాత్మకమైన విధానాలతో ముందుకు సాగి అనుకున్న విజయాలు సాధిస్తారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

మీ ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఊరటనిస్తుంది.

పెండింగ్‌లో పడిన బాకీలు కూడా వసూలవుతాయి.

ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారమంతా గడుస్తుంది.

గతంలో చేజారిన సొమ్ము అనూహ్యంగా చేతికందే అవకాశాలు.

ఆస్తుల విక్రయాలు కూడా లాభించి అనుకున్న సొమ్ము లభిస్తుంది.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.

సంతానం నుంచి కీలక సమాచారం రాగలదు.

వారి విదేశీ విద్య, ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి.

వివాహాది వేడుకల నిర్వహణ పై సమాలోచనలు జరుపుతారు.

అనారోగ్య రుగ్మతల నుంచి బయటపడతారు.

వైద్య సేవలకు స్వస్థి చెబుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు వైపు సాగుతారు.

కొత్త భాగస్వాముల చేరికతో మరింత విస్తరిస్తారు.

ఉద్యోగాలలో విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది.

ఉన్నత పోస్టులు దక్కే అవకాశాలు.

అనుకున్న మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబంలో విశేష గౌరవమర్యాదలు దక్కుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. 

అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces