Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Sagittarius

ధనుస్సు

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

నిరుద్యోగుల శ్రమ వృథా కాదు.

అనుకున్న అవకాశాలు సాధిస్తారు.

కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అందుతాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మిత్రులతో మరింత సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.

గృహ నిర్మాణాలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి.

సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

ఇతరుల నుంచి సైతం బాకీలు అందుకుంటారు.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

ఆస్తుల విక్రయాలు కూడా లాభించి అనూహ్యంగా డబ్బు అందుకుంటారు.

కుటుంబంలో అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది.

అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు.

మీ నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి.

సంతానం నుంచి శుభవర్తమానాలు.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊపిరిపీల్చుకుంటారు.

వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు.

నూతన భాగస్వాములు, పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాల లో కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.

ప్రమోషన్లు దక్కవచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం.

మహిళలకు ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces