Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Sagittarius

ధనుస్సు

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగానే సాగుతుంది.

ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు సహాయకారులుగా నిలుస్తారు.

విద్యార్థుల ప్రతిభాపాటవాలు గుర్తింపులోకి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

అవసరాలకు డబ్బు సమకూరి ఊరట చెందుతారు.

రుణ దాతలు ఒత్తిడులు తగ్గిస్తారు.

షేర్లలో పెట్టుబడులు సమకూరతాయి.

మీ ప్రేమాభిమానాలతో దూరమైన బంధువులు సైతం దగ్గరవుతారు. సోదరీలతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.

సంతాన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యపరంగా క్రమేపీ స్వస్థత చేకూరుతుంది.

వైద్యసేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు.

అలాగే, పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

మంచి గుర్తింపు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విజయాలు వరిస్తాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces